కిరణ్-బొత్సల మధ్య మరింత అగాధం పెంచిన ధర్మాన రాజీనామా

 హైదరాబాద్: ఇప్పటికే ఎడముఖం, పెడముఖంగా ఉన్న సీఎం కిరణ్-పీసీసీ చీఫ్ బొత్సల మధ్య ధర్మాన ప్రసాదరావు వ్యవహారం మరింత అగాధాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ధర్మాన రాజీనామాపై సీఎం తనతో మాట్లాడకపోవడాన్ని పీసీసీ చీఫ్ జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ ధర్మాన విషయమై కలిసిన ప్రతి ఒక్కరితో చర్చిస్తున్నారు. కానీ, పీసీసీ చీఫ్ తో మాట మాత్రమైన చర్చించకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. బొత్స మాత్రం ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ధర్మాన విషయమై అందరితో మాట్లాడుతూ తనతో మాట్లాడకపోవడమంటే సీఎం తనను పెద్దగా ఖాతరు చేయడం లేదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఇద్దరి మధ్య మరింత గ్యాప్ ఏర్పడుతోంది.  వాన్ పిక్ భూపందేరంలో ధర్మాన ప్రసాదరావు మంత్రి హెదాలో ఓ వ్యక్తికి వందల కోట్ల రూపాలయ లబ్ది చేకూరే విధంగా వ్యవహారించాడంటూ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో 5వ నిందితుడుగా పేర్కొనడం....మంత్రి పదవీకి ధర్మాన రాజీనామా చేసి అధికార విధులకు దూరంగా ఉంటున్నారు. మంత్రి ధర్మాన రాజీనామా రాష్ర్ట కాంగ్రెస్ను, కింగ్రస్ సర్కార్ను ఓ కుదుపు కుదుపేస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మంత్రిగా తాము జీవోలు జారీ చేసినప్పటకీ సీబీఐ మాత్రం ఒక్కొక్కర్ని చార్జిషీటులో చేరుస్తూ ప్రాసిక్యూషన్ చేసేందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడాన్ని యావత్ సీనియర్ మంత్రులంతా తప్పుబడుతున్నారు. ఇదే అంశంపై పీసీసీ చీఫ్ బొత్స కూడా కొంత అసంత్రుప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ మంత్రి ధర్మాన విషయాన్ని ఏం చేద్దామనీ అందరూ మంత్రులు మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయమై సీఎం గవర్నర్ నరసింహన్ తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కానీ, పీసీసీతో మాత్రం సీఎం కిరణ్ ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం పట్ల బొత్స అసంత్రుప్తితో ఉన్నట్లు సమాచారం.  ఈ విషయాన్ని బొత్స తన సన్నిహితుల వద్ద చెబుతూ తన కనీసం మాట మాత్రం కూడా సీఎం చర్చించకపోవడం ఏమిటని వాపోయినట్లు తెలుస్తోంది. బహిరంగంగా కూడా బొత్స తన మనసులోని మాటను వ్యక్తం చేస్తున్నారు. ధర్మాన మంత్రి పదవీకి రాజీనామా చేసిన అనంతరం కూడా బొత్స-సీఎం కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు కూడా ధర్మాన రాజీనామా విషయాన్ని పీసీసీ హెదాలో ఉన్న తనతో సీఎం మాట్లాడకపోవడం పట్ల బొత్స మండిపడుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య చెప్పుకోదగ్గ సత్సంబంధాలు లేవు. ఎవరికి వారుగా ఢిల్లీ వెళ్లడం, అక్కడ ఢిల్లీ పెద్దల్ని కలువడం, ఎవరి నివేదికలు వారు ఇస్తూ వస్తున్నారు. తాజాగా ధర్మాన రాజీనామాతో ఈ ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగింది. పీసీసీ చీఫ్ అయిన తనతో మాట మాత్రం కూడా సీఎం మాట్లాడకపోవడాన్ని బొత్స తీవ్రంగా పరిగణిస్తున్నారు.  మొత్తానికి ధర్మాన రాజీనామా వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇది దారి తీస్తుందో ఎవరికీ అంతుపట్టడం లేదు, అర్థం కావడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: